సిపిఎం వైరా మండలపార్టీ , గ్రామ శాఖ ఆధ్వర్యంలో జింకలగుడిశ గ్రామంలో ప్రజా సమస్యలపై సర్వే చేయడం జరిగింది . అనంతరం వైరా మధిర రోడ్ పై జింకలగుడిస గ్రామం వద్ద సమస్యలపై రాస్తారోకో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎక్కువ మంది కడు నిరుపేదలు ఉన్న గ్రామం, అభివృద్ధిలో కూడా వెనకబడి ఉన్న గ్రామం జింకలగుడిశ. ఇట్టి గ్రామంలో అనేక ప్రజా సమస్యలు సర్వే బృందం దృష్టికి వచ్చాయి అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు , వితంతు, వికలాంగు పెన్షన్లకు అర్హులై ఉండి రాని వారు చాలామంది ఉన్నారని సర్వేలో తేలింది. వారు అన్నారు.