జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి దివిటి పద్మ ప్రజాక్షేత్రంలో నిరంతర సేవలతో విశేష ప్రజాదరణ పొందుతున్నారని, తెలుగుదేశం పార్టీలో ఆమెకు సముచిత స్థానం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణయ్య యాదవ్ పేర్కొన్నారు.జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బీసీల తరపున ఉద్యమిస్తూ గుర్తింపు తెచ్చుకున్న పద్మ, తెలుగుదేశం పార్టీలో కీలక స్థానంలో ఉంటే బడుగు బలహీన వర్గాలకు మరింత సేవలందించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.