గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రూ.90వేల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం సాయంత్రం ఏటూరునాగారం సిఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ వివరాలు.. ఈనెల 12న మంగపేట మండలం బ్రాహ్మణపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సతీష్, సాగర్, ఖలీమ్, దుర్గాప్రసాద్, శ్రీనాథ్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని తనిఖీ చేశామన్నారు. వారి వద్ద గంజాయి, ఆటో, ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.