సెప్టెంబర్ 2 నుండి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బాన్సువాడ డివిజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పత్రికా ప్రకటన ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ప్రాజెక్టులు చెరువులు వాగులు, వంకలు, పాత ఇల్లు భవనాలు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు గ్రామస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. పశువుల గొర్రెల కాపరులు వాగుల పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.