తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామానికి చేరుకున్నారు. తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి పట్టణానికి పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రి పట్టణానికి వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో తిమ్మంపల్లి గ్రామం వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ముందుగా తిమ్మంపల్లి గ్రామంలోని దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు తాడిపత్రి పట్టణానికి వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా చూడాలని పూజలు చేశారు. వైసిపి నేతలు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చర్చించారు.