ఆళ్లగడ్డ అమ్మవారి శాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈనెల 12న రాత్రి జరిగే గ్రామోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ షేక్ నగీన తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. అమ్మవారి ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.