ప్రకాశం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనుల నేపథ్యంలో ఎరువులు, పురుగుమందులకు ఉన్న అధిక డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, కొంతమంది వ్యాపారులు యూరియా నిల్వలు చేసి బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, ఆదేశాల మేరకు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో మంగళవారం జిల్లాలోని మొత్తం 121 ఎరువుల దుకాణాలు, ఎరువుల గూడెంములు, PACS గూడెంములు, మరియు పలు ప్రదేశలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.