మంగళవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి గ్రామాలలోని కుంటలు చెరువులు ప్రమాదకరంగా రహదారులపై ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం పోసాని కుంట కట్ట తెగిపోవడంతో గ్రామంలోని ఇళ్లలోకి వర్షం నీరు చేరి సామాగ్రి కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నిత్యవసర వస్తువులు నీట మునిగి కొట్టుకపోవడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని సహాయ చర్యలు త్వరగా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.