ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి తరలిపోకుండా చర్యలు చేపట్టాలని కోరితే కేసులు పెట్టడం అన్యాయమని మంగళవారం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు బాట ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని, కార్యకర్తలను నిలువరించడానికి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకొని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆర్డిఓ ఆఫీస్ కు చేరుకుని కార్యాలయ ఏఓ అక్బల్ బాషాకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేలమంది రైతులు తమ సమస్యలపై రోడ్డు ఎక్కారన్నారు. యూరియా కొరత సృష్టించింది కూటమి ప్రభుత్వమని తెలిపారు.