, గజపతినగరం పంచాయతీ పరిధిలోని ఎన్జీఆర్ పురం సమీపంలో ఉన్న వాసవి ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీ నుంచి చెరువులోకి వస్తున్న కలుషిత నీటిని ఆపాలని, ఈ విషయం నా అధికారులు చర్యలు తీసుకోవాలని గురువారం రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ నుంచి చెరువులోకి వస్తున్న నీటికి రైతులు అడ్డుకట్ట వేశారు. చెరువులోకి పరిశ్రమ వ్యర్థ జలాలు రావడం వలన భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు గ్రామంలో తాగునీరు సైతం కలుషితం కావడం వల్ల రోగాల బారిన పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.