కడుపు నొప్పికి తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై గోవర్ధన్ శనివారం తెలిపారు. ఉయ్యాలవాడ కు చెందిన మణెమ్మ చాలా రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ మనస్థాపానికి గురై ఈనెల 17న ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించి చికిత్సగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.