సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలోని రాయికోడు మండలం కుసునూరు వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. ఆదివారం సాయంత్రం వాగును దాటే క్రమంలో అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి వాగులో బైక్ తో సహా గల్లంతయిన విషయం విధితమే. సోమవారం ఉదయం నాగ్వార్ శివారులో గల్లంతైన వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.