మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం అలిపిరిమెట్ల మార్గాన తిరుమల కొండపైకి బయలుదేరారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు తిరుపతికి వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గం వద్ద పూజలు చేసి, అనంతరం తిరుమల కొండపైకి మెట్ల మార్గాన్ని బయలుదేరారు. అంతకుముందు మల్లారెడ్డికి ఎయిర్పోర్టులో నాయకులు, స్థానిక అభిమానులు ఘన స్వాగతం పలికారు.