ఆదివారం మండలంలోని రాజేపేట తండా నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించారు ప్రమ.అనంతరం సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలునిర్వహించారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే గిరిజన సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. గిరిజన యువతులు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని అన్నారు. ప్రకృతి తమను చల్లగా చూడాలని కోరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు పరశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.