విశాఖపట్నం నగరం ఇప్పుడు రాజకీయంగా కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే సమయంలో నగరంలో పర్యటించనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.మంత్రి నారా లోకేష్ గురువారం విశాఖ రానున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మూడు రోజులు ఆయన టీడీపీ కార్యాలయంలోనే బస చేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఆయన కూడా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.