కుటుంబ కలహాలు నేపద్యంలో అధికంగా మద్యాన్ని సేవించి, పురుగుల మందు తాగి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు నియోజకవర్గంలోని ఆండ్ర ఎస్సై సీతారాం బుధవారం సాయంత్రం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని గుర్ల గ్రామానికి చెందిన కుమిలి సంతోష్ కుటుంబ కలహాలతో పూటుగా మద్యాన్ని సేవించి, నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద పురుగుల మందును తాగాడన్నారు. గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని గజపతినగరం ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు వీడినట్లు అక్కడ వైద్యులు తెలిపారు.