అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటుచేసిన వెంచర్లకు చట్టబద్ధత కల్పించుకునే అద్భుత అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని కర్నూలు కూడా చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం నగరంలోని కూడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు ఊరట కలుగుతుందని ఆయన అన్నారు. గతంలో అనేక మంది రిజిస్ట్రేషన్లు లేకుండా స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించారని, ఆ వెంచర్లలో నివసిస్తున్న ప్రజలకు ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. విద్యుత్, నీరు, రోడ్లు, కాల్వల వంటి ప్రాథమిక సదుపాయాలు