శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామస్తులు ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు నడుంబిగించారు. బెల్ట్ షాపుల భరతం పట్టాలని సంకల్పించారు.గ్రామంలో మద్యపానాన్ని నిషేదిస్తూ ఇటీవల ఓ తీర్మానం చేశారు. కొందరు పెద్దలు సమావేశమై మద్యపాన నిషేద తీర్మానంపై చర్చించారు.గ్రామంలో ఎవరూ బెల్ద దురాణాలు పెట్టొద్దని హెచ్చరించారు. మద్యం అమ్ముతున్నవారిని గుర్తించి పదివేల రూపాయలు జరిమాన విధించుటట్లు తీర్మానం చేసుకున్నారు గ్రామంలో ఎవరు కూడా మద్యపానం చేయకూడదని ఊర్లో దండోరా వేయించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలియజేశారు.