అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్లో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో నగరంలోని ముసలమ్మ కట్ట కాలనీకి చెందిన అనసూయమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. రెండు ఆటోలు ఒకటి ఒకటి ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన అనసూయమ్మను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.