అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందిన పెన్నోబిలం అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన అతనిని గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వేజనా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.