ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఆదివారం పర్యటన తాకిడి అధికంగా కనిపించింది. మధ్యాహ్నం తర్వాత అలల ఉధృతి అధికంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యటకులు ఉదయం 10 గంటల నుంచి సముద్ర తీరానికి భారీగా తరలివచ్చారు. సముద్రం అలాల ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు సముద్రం లోకి మరింత లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు పడ్డారు.