పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలంలోని తాళ్ళడుమ్మ గ్రామంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పళ్లెం శ్రీరామ్ ఇంట్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూటివ్ వలన అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలో ఉన్న మరో ఇంటికి అగ్ని మంటలు వ్యాపించాయి. ఇంచార్జ్ ఎస్ఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం అగ్నిమాపకు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంతులను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఐదు లక్షల మేర నష్టం వాటిలోనట్లు బాధితులు వాపోయారు.