కోవెలకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ పవన్ కుమార్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్ నాయుడుకు వినతిపత్రం అందించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే సుబ్బరాయుడు డిమాండ్ చేశారు.