తొలి తరం తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమరాలు తెలంగాణ ఆస్తిత్వాన్ని ప్రజల్లో బలపరిచిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అంటూ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా అదరపు కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం నైజాం ప్రభుత్వంతో పోరాడిన తొలి తరం తెలంగాణ రైతంగ సాయుధ ఉద్యమరాలు అని గుర్తు చేశారు