ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజీ పై హోం మంత్రి అనిత సెటైర్లు వేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెడికల్ కాలేజీలు పూర్తికాకుండానే పూర్తయ్యాయని మాజీ సీఎం జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. మార్కాపురం పట్టణంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వీడియో స్క్రీన్ పై చూపిస్తూ గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో వివరించారు.