గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం, మాంబేడు పంచాయతీ, ధర్మలచెరువు హరిజనవాడలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. రేషన్ షాపులలో లబ్ధిదారులకు సులభతరంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ చేయడానికి ఈ స్మార్ట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.