నరసాపురం వీవర్స్ కాలనీలో మహిళల ఆందోళన నరసాపురం వీవర్స్ కాలనీలో వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న మహిళలు పట్ల ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రాత్రి 10:30కు పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ యాదగిరి, ఎస్సై జయలక్ష్మి సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడినా వారు పట్టువీడలేదు. దీంతో డీఎస్పీ శ్రీవేద మహిళలతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.