పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతానగరం మండలంలోని మరిపివలస మలుపు వద్ద ఓ RTC బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృష్ణాపురానికి చెందిన ఏ.శ్రీను మృతి చెందినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించామన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.