వెదురుకుప్పం మండలం బొమ్మయ్య పల్లి గ్రామంలోని కొన్ని ఇళ్లకు దారి లేదని గ్రామస్థులు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని కొన్ని వీధులకు సీసీ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.