కర్నూలు నగరంలో గణనాథుడి శోభాయాత్ర గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తన కుమారుడితో కలిసి నృత్యాలు చేసి యువతను ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణనాథుడి శోభాయాత్ర కులమతాలకు అతీతంగా వైభవంగా జరుపుకోవడం కర్నూలు సాంప్రదాయమని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు