కుప్పం పూరీ ఆర్ట్స్ పురుషోత్తం మరోమారు తన ప్రత్యేకతను శుక్రవారం చాటుకున్నాడు. కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు చిరకాల స్వప్నం నెరవేరిన నేపథ్యంలో హంద్రీనీవా నీటికి రంగులు కలిపి ఆయన చిత్రాన్ని ఆవిష్కరించాడు. హంద్రీనీవా కాలువ పక్కనే వేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.