ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యవసర సరుకులు పారదర్శకంగా ప్రతి అర్హుడికి చేరాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్మార్ట్ కార్డులు పంపిణీ చేపట్టారని తెలిపారు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆచంట గ్రామపంచాయతీ వద్ద డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అర్హులకు రేషన్ కార్డులు అందజేసేందుకు జాప్యం జరక్కుండా చూడాలని, రేషన్ డీలర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు