నల్లగొండలోని నాగార్జున సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం ఎదురుచూపులు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 5 గంటల నుంచి అన్నదాతలు బారులు తీరారు. యూరియా నిలువలు తక్కువగా ఉన్నాయని అధికారుల ప్రకటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు కీలకమైన యూరియా అంధక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.