విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండలం ఆల్బాక లో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్ రవి మాట్లాడుతూ.. సూరవీడు, ఎదుర, అబ్బాయి గూడెం ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఆల్బాక ప్రభుత్వ పాఠశాలలోకి చదువుకోవడానికి వస్తుంటారు. కానీ పాఠశాల సమయంలో బస్సులు లేక రోజుకు 80 నుంచి 100 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. పేద విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక చదువుకోలేక ఖర్చులు పెట్టి రాలేకపోతున్నారు పాఠశాల కళాశాలలో బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.