శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక వైద్యశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా వైద్యాధికారి ఫిరోజ్ బేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇహెన్ఆర్ నమోదు ఎక్కువగా చేయాలని, తప్పకుండా రోగులు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. డ్యూటీలో ఉన్న ప్రతి ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.