నిర్మల్ కలెక్టరేట్‌లో సోమవారం టేబుల్ టెన్నిస్ కోర్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన కోర్టును కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కార్యాలయ పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఉద్యోగులు, సిబ్బంది విధులు ముగిసిన తర్వాత కోర్టును వినియోగించుకోవాలని సూచించారు.