మెట్పల్లి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన,70 సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూం మెట్పల్లి పోలీసు స్టేషన్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వార నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు ఇలా ఎన్నో నేరాలను కంట్రోల్ చెయ్యవచ్చని అన్నారు.ఒక్క కెమెరా వంద మందితో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, సిఐ లు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.