విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తగరపువలస, భీమిలి ఏరియా చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ నిత్యావసరాలు సరఫరా చేసే డిపోలు సమయపాలనగాని, సరుకులు సరఫరా గాని ప్రజలకు సౌకర్యంగా ఉండడం లేదు. డిపోల ముందు సరుకులు ఇచ్చే సమయం గాని, డిపో నెంబరు కలిగిన బోర్డులు ఏమి ఉండడం లేదు. ఈ పద్దతి వలన సరుకులు తీసుకోవడానికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బంందులకు గురౌతున్నారు. మరో పక్క ప్రభుత్వం కొత్తగా ప్రజలకు మంజూరు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ నత్త నడకన సాగుతున్నాయి. వాటి వివరాలు అడిగే ప్రజలు పట్ల డిపో యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు.