షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కన్నా కూతురు కవిత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని గురించి ప్రస్తావిస్తుంటే బిఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని అన్నారు. అందుకే కవితను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అవినీతిని ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాల్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.