శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి సమీప పాత జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాశిబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.