కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దనూరు మండలం కె తిమ్మాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో శుక్రవారం శ్రీ రామ రైతు మిత్ర సంఘానికి డ్రోగో డ్రోన్ పరికరాన్ని గ్రూప్ సభ్యులకు అందించినట్లు ఏడీఏ రామ మోహన్ రెడ్డి మరియు మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ పూర్తి ధర 9 లక్షల 80 వేల రూపాయలు అని ఇందులో రాయితీ 80 శాతం పోను, రైతు వాటా 20 శాతం చెల్లించాలన్నారు.తదుపరి డ్రోగో డ్రోన్ పరికరం పని చేసే విధానాన్ని ,ఉపయోగించే విధానాన్ని డెమో రూపంలో కంపెనీ ఉద్యోగి వివరించారు.