నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు ముందర సోమవారం 10 గంటల నుండి ఆశ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో లో పేర్కొన్న హామీలు నెరవేర్చాలని అన్నారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో తహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.