గతంలో కన్నా నేడు గ్రామాలలో ఆధ్యాత్మిక చింతన కొనసాగుతుందని ఇది ఎంతో శుభ పరిణామమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలం గెడ్డవాని పేట గ్రామంలో సుందర అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాలు కొలువుదీరుతున్నాయని అన్నారు.