అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షేక్ రేష్మ అనే మహిళ సోమవారం ఉదయం మృతి చెందింది. సూపర్ వాష్ మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.