జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ఎఎల్‌ఎస్) అంబులెన్స్‌ను రాజమండ్రి అర్బన్ కు కేటాయించడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. శనివారం రాత్రి ఈ అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి పరిశీలించారు.