చిత్తూరు : లెర్న్ ఎక్స్ ఆర్ట్ కార్నివల్ - 2025 కార్యక్రమంలో భాగంగా ఆదివారం పీవీకేన్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గీస్తున్న చిత్రాలను ఆసక్తిగా తిలకించి ఉత్సాహపరిచారు. విద్యార్థుల ఉత్సాహం చూసి ఎమ్మెల్యే స్వయంగా పెన్సిల్ పట్టి డ్రాయింగ్ వేశారు. తమ పార్టీ సింబల్ అయిన సైకిల్ బొమ్మను గీసి నిర్వాహకులకు అందించారు. చదువుకునే రోజుల్లో పెద్దగా డ్రాయింగ్ వేయలేదని.. ఇప్పుడు పార్టీ సింబల్ బొమ్మ వేశాను.. అందరితో పాటే ఈ బొమ్మకు మార్కులు ఇవ్వాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం