రాజంపేట ను జిల్లా కేంద్రం సాధించాలనే ప్రయత్నానికి తన వంతు సహకారం అందిస్తానని కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, టిడిపి పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గం ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి హామీ ఇచ్చారు. రాజంపేట జిల్లా కేంద్రం సాధన జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులు ఓబులవారిపల్లె మండలం ముక్కావారి పల్లె లోని ఆయన స్వగ్రామంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని అర్హతలు కల్గిన రాజంపేట ను జిల్లా కేంద్రం చేస్తే మొదట కోడూరు నియోజక వర్గానికి చెందిన అన్ని మండలాల ప్రజలు ఆనంద పడతారని ఆయన వారితో అన్నారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు తరిగోపుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.