పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో శనివారం గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుల ఊరేగింపు వైభవంగా జరిగింది. న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 30 బుజ్జి వినాయక ప్రతిమలను ట్రాలీపై ఊరేగించారు. చాకలిపాలెం నుంచి రాజోలు మండలం సోంపల్లి వరకు ఊ రేగింపుగా తీసుకువెళ్లి ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.