ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 818 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా వాటిలో 5909 గృహాలకు మార్కింగ్ ఇచ్చి ప్రారంభించడం జరిగిందని, 2660 గృహాలు బేస్మెంట్ లెవల్ వరకు, 283 ఇండ్లు రూమ్ లెవెల్ వరకు, 107 ఇండ్లు స్లాబ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యాయని అన్నారు.