కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ కాలనీలో రోడ్డు, డ్రైనేజీ పనులు నెలలుగా జరగకపోవడంతో బస్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంటు ఇన్చార్జ్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి బండి రమేష్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే జిహెచ్ఎంసి ఈఈ తో ఫోన్లో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు.